కోటగుళ్లలో డాక్టర్ స్నిగ్ధ సంస్కృతి పూజలు
కోటగుళ్ళు గోశాల గోమాతలకు దానా బస్తాల వితరణ
గణపురం, అక్టోబర్ 06 (విజయ క్రాంతి): ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం(Kakatiya Hub of Art and Culture) శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో భూపాలపల్లి సాయిరత్న ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ స్నిగ్ధ సంస్కృతి కళ్యాణ్ చక్రవర్తి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ స్నిగ్ధ సంస్కృతి స్వామివారికి పట్టు వస్త్రాలు పూలమాలలను సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని గోశాల గోమాతలకు దాన బస్తాలను, పండ్ల ను అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. గోశాల గోమాతలకు దానా బస్తాలను అందజేసిన డాక్టర్ దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.