16 March, 2026 | 11:54 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్‌ బహిరంగ లేఖ

11-07-2024 03:33 PM

హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం బహిరంగ లేఖ రాశారు. పదేళ్లుగా కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి మొండిచెయ్యి చూపిందన్నారు. అనేకసార్లు పవర్లూమ్ క్లస్టర్ కోసం పది సార్లు కేంద్రానికి లేఖలు, స్వయంగా కలిసి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈసారి అయినా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను తెప్పించండన్నారు. కేంద్రమంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండని కేటీఆర్ తెలిపారు. 

సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నేతన్నల కష్టాలు కొంత మేరకు తీరుతాయని పేర్కొన్నారు. క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులు, వనరులు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయని వెల్లడించారు. నేతన్నలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలకుల వైఫల్యం వల్ల చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఈసారి కేంద్ర బడ్జెట్ లో సిరిసిల్లకు గుడ్ న్యూస్ వచ్చేలా చూడాలని కేంద్రమంత్రిని కేటీఆర్ కోరారు.