నేటితో కుంభమేళా ముగింపు
- పోటెత్తనున్న భక్తులు!
- చివరి అమృత స్నానం కోసం ప్రత్యేక ఏర్పాట్లు
- నో వెహికిల్ జోన్‌గా కుంభమేళా
- నేడు కోటి మంది పుణ్యస్నానమాచరించే అవకాశం!
ప్రయాగ్ రాజ్, ఫిబ్రవరి 25: నెలన్నర పాటు దేశాన్ని భక్తి పారవశ్యంలో ముంచుతూ సాగిన మహాకుంభమేళా నేటితో ముగియనుంది. త్రివేణి సంగమంలో నేడు చివరి అమృత స్నానం తర్వాత కుంభమేళా ముగియనుంది. ఇప్పటికే 64 కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.
నేడు జరిగే చివరి అమృత స్నానానికి కోటికి పైగా మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మహా కుంభ మేళా ప్రాంతాన్ని నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు. నేడు జరగనున్న ఆఖరి పుణ్యస్నానానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇక్కట్లు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. మంగళవారం సాయంత్రం నుంచి మేళా ప్రాంతాన్ని నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు.
ఐదు అమృత స్నానాలు
జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటికే ఐదు అమృత స్నానాలు ముగిశాయి. జనవరి 13, 14, 29 ఫిబ్రవరి 3, 12 అమృతస్నానాలు ముగిశాయి. నేడు జరగనున్న అమృత స్నానం ఆరో అమృత స్నానం.ఇప్పటి వరకు త్రివేణీ సంగమంలో 64 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. నేటి ఆఖరి పుణ్యస్నానం కోసం వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఎటు నుంచి వచ్చే భక్తులు ఎక్కడంటే..
కుంభమేళాకు వివిధ ప్రాంతాల నుంచి పుణ్యస్నానాల కోసం భక్తులు తరలివస్తున్నారు. లక్నో, ప్రతా ప్‌గర్ ప్రాంతాల వైపు నుంచి వచ్చే భక్తులు పఫా మావు ఘాట్‌లో, రేవాన్, బాండా, చిత్రకూట్, మిర్జాపూర్ వైపు నుంచి వచ్చే భక్తులు అరాలీ ఘాట్‌లో, అ లాగే కౌసంబి వైపు నుంచి వచ్చే భక్తులు సంగం ఘాట్‌లో పుణ్యస్నానాలు చేసేలా ఏర్పాట్లు చేశారు.
సరుకులతో వచ్చే వాహనాలు మాత్రమే
నేడు జరగనున్న చివరి అమృత స్నానానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. కుంభమేళా జరుగుతున్న ప్రాంతాన్ని మంగళవారం సాయంత్రం నుంచి, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి ప్ర యాగ్‌రాజ్ మొత్తం నో వెహికిల్ జోన్‌గా మారుస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేవలం ప్రయా గ్ రాజ్‌కు సరుకు రవాణా చేసే వాహనాలను మాత్ర మే అనుమతించనున్నారు. మిగిలిన వాహనాలను ప్రయాగ్‌రాజ్ బయటే నిలిపివేయనున్నారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ప్రధాన మార్గాల్లో పోలీసులు పహారా కాయనున్నారు.






