విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణి

03-10-2026 | 06:13pm

కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల(Kusumanchi School)లో విద్యార్థులకు ప్రభుత్వ ఉచిత ఏకరూప దుస్తులు, బూట్లు, బెల్టులను కూసుమంచి ఎంఈవో వీరస్వామి, స్థానిక సర్పంచ్ కొండా కృష్ణవేణిమహిపాల్ విద్యార్థులకు శనివారం పంపిణి చేశారు.  పాఠశాలకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారు ఉచితంగా టీవీని బహుకరణ చేరగా ప్రారంభించారు. అదేవిధంగా ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు(Best Teacher Award) అందుకున్న ప్రధానోపాధ్యాయులు భాస్కర్ ని అలాగే మండల విద్యాశాఖ అధికారి ఆర్ వీరస్వామికి  కూసుమంచి మండల గ్రామ పెద్దలు ఘనంగా సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో కూసుమంచి గ్రామ సర్పంచ్ కొండ కృష్ణవేణి, వైస్ సర్పంచ్ చెన్ను వెంకటరమణ,మాజీ ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, వార్డు సభ్యులు ఆన్తోటి వెంకన్న, చెరుకుపల్లి వీరయ్య, యూత్ సభ్యులు, ఏఏపీసీ చైర్మన్ మంద మహేశ్వరి, అలాగే ముఖ్యఅతిథిగా ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అధ్యక్షులు బయాన బాబురావు, మండల వనరుల కేంద్ర సిఆర్పిలు, ఇతర సిబ్బంది హాజరయ్యారు.

మరిన్ని వార్తలు