ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్మన్‌ను కలిసిన లగచర్ల ఫార్మా బాధితులు
18-11-2024 03:26 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్ పర్సన్ విజయ భారతి సయానీని లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలు సోమవారం కలిసి ఫిర్యాదు చేశారు. లగచర్ల గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసీటి కంపెనీకి సంబంధించి భూసేకరణ చేయడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటనపై ఎన్‌హెచ్ఆర్‌సీ అధికారులకు వివరించారు. ఈ ఘటనపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. లగచర్ల బాధిత కుటుంబాలతో పాటు ఎన్ హెచ్ఆర్సీకి బీఆర్ఎన్ నేతలు ఫిర్యాదు చేశారు.






