25 May, 2026 | 1:28 PM

సుల్తానాబాద్ లో న్యాయవాదుల విధుల బహిష్కరణ

25-05-2026 12:56 PM

సుల్తానాబాద్, మే 25 (విజయక్రాంతి): హైదరాబాద్‌ హైకోర్టు న్యాయవాది(High Court Advocate) ఖాజా మొయినుద్దీన్ పై జరిగిన దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాదులు కోర్టు  విధులను(Lawyers Boycott Duties) బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు  వొడ్నాల రవీందర్ మాట్లాడుతూ మొహినిద్దీన్ ను హత్య చేసిన నిందితులపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకొని, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు.

అలాగే న్యాయవాదుల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. మృతుని కుటుంబ సభ్యులకు బార్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆవునూరి సత్యనారాయణ న్యాయవాదులు భూసారపు బాలకిషన్ ప్రసాద్, జోగుల రమేష్, బోయిని భూమయ్య, గుడ్ల వెంకటేష్, మల్యాల కరుణాకర్, అంబాల రాజు, అశోక్, సందీప్   పాల్గొన్నారు.