చట్టాలపై అవగాహన పెంచుకోవాలి..

06-10-2026 | 03:30pm

బేల అక్టోబర్ 06(విజయక్రాంతి): చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.హుస్సేన్(District Legal Services Authority Secretary B. Hussain) అన్నారు.సదల్పూర్ గ్రామంలో పేదరిక నిర్మూలన, ఉచిత న్యాయ సహాయం పై మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులకు సోషల్‌ మీడియా, విద్యా హక్కు, ఉచిత న్యాయ సహాయం కోసం టోల్‌ ఫ్రీ నెంబర్‌, చైల్డ్‌ మ్యారేజ్‌,ఫారెస్ట్ చట్టాలు,ట్రైబల్ చట్టాలు, రైతులకు నకిలీ విత్తనాలు ,మందులపై  వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

అవగాహన సదస్సు అనంతరం మహదేవ్ ఆలయాన్ని సందర్శించి ఆలయ చరిత్రను అడిగి  తెలుసుకున్నారు,మినీ గురుకులంను సందర్శించి అక్కడి మౌలిక వసతులు పిల్లలను అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారం,  అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ రావు డోలే,స్థానిక సర్పంచ్ మంగేష్,మినీ గురుకులం సిబ్బంది,అంగన్వాడీ టీచర్లు,ఆశ కార్యకర్తలు,అధికారులు,గ్రామస్తులు,రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు