13 July, 2026 | 5:13 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

ఉస్మాన్‌సాగర్ ఆరు గేట్లు ఎత్తివేత

01-10-2024 02:20 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు నిండుకుండలుగా మారాయి. సోమవారం రాత్రి 8 గంటలకు అధికారులు ఉస్మాన్ సాగర్ జలాశయానికి సంబంధించిన ఆరు గేట్లను ఒక ఫీట్ మేర ఎత్తి దిగుకు వదులుతున్నారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్‌కు ఇన్‌ఫ్లో 700 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 726 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం (1790.00 అడుగులు)తో 3.900 టీఎంసీల నీళ్లు కలిగిఉంది. అటు హిమాయత్ సాగర్‌కు కూడా వరద కొనసాగుతోంది. హిమాయత్ సాగర్‌కు ప్రస్తుతం 300క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.