నర్మదాలో 11వేల లీటర్ల పాలు
12-04-2026 12:56 AM
జలాలు కలుషితం అయ్యాయని పర్యావరణ వేత్తల ఆందోళన
భోపాల్, ఏప్రిల్ 11: మధ్యప్రదేశ్‌లోని సి హోర్ జిల్లా భైరుందా వద్ద 21 రోజులపాటు నిర్వహించిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం అ నంతరం నిర్వాహకులు 11వేల లీటర్ల పాల ను నర్మదా నదిలోకి వదలడంపై పలు విమర్శలు వస్తున్నాయి. పర్యావరణ వేత్తలు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు.
పాలు సేంద్రియ కాలుష్య కారకంగా మారి నీటిలో ఆక్సిజన్ క్షీణిస్తుందని చెబుతున్నారు. దీంతో నర్మదా నీటిపై ఆధారపడిన స్థానికులు, జలచరాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పర్యావరణవేత్త అజయ్ దూబే ఆందోళన వ్యక్తం చేశా రు. నదిలో పాలను వదలడంపై ఆధ్యాత్మిక కార్యక్రమంలోని పలువురు నిర్వాహకులు మాట్లాడుతూ.. నీటి స్వచ్ఛత, భక్తుల శ్రేయ స్సు, సౌభాగ్యం కోసం చేసే ఒక ఆచారం, ప్రత్యేకభక్తిని చాటుకోవడమన్నారు.




