12 April, 2026 | 2:17 AM

డీజిల్‌పై ఎగుమతి సుంకం పెంపు

12-04-2026 12:55 AM

లీటర్‌కు రూ.౨౧.౫ నుంచి రూ.౫౫.౫కు పెరుగుదల

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: దేశీయంగా ఇంధన లభ్యత పెంచేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్ ఎగుమతులపై విధిస్తున్న సుంకాన్ని లీటరుకు రూ.21.5 నుంచి ఏకంగా రూ.55.5 పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, విమాన ఇంధన ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.29.5 నుంచి రూ.42కు పెంచింది. అయితే, పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని మా త్రం ‘సున్నా’ వద్దే ఉంచింది.

దేశీయంగా పెట్రోల్ నిల్వలు సరిపడా ఉండటమే అం దుకు కారణమని అధికారవర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు ఒడిదుడుకుల తరుణంలో కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.