ఒక్కటైనా అక్క తమ్ముళ్లు

13-09-2026 | 12:31am

మెట్ పల్లి,(విజయక్రాంతి): మెట్ పల్లి కోర్ట్ కాంప్లెక్స్(Mettupally Court Complex)లో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్(Lok Adalat)లో అక్కా తమ్ముళ్లు కలసిపోయి తమ ఆస్తి వివాదానికి ముగింపు పలికారు. వివరాల్లోకి వెళ్తే బండలింగాపూర్ గ్రామానికి చెందిన కాసబోయిన వనిత తన తల్లి చనిపోయాక, తండ్రి రెండవ పెళ్ళి చేసుకున్నాడు. వనిత పెళ్ళి అనంతరం పినతల్లి పిల్లలతో వివిధ గొడవలు కాగా, వారసత్వ ఆస్థి పై తమ్ముళ్లు రాకేష్, రూపేష్, చెల్లె కవిత పై పార్టీషన్ సూట్ ఫైల్ చేసింది. సమన్లు అందుకున్న రాకేష్  జవాబు వ్రాసినప్పటికి, మీడియాషన్ కేంద్రం ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి, తల్లికి చెందిన ముప్పై గ్రాముల బంగారం ఇప్పించడం ద్వారా చివరికి రాజీపడ్డ వనిత శనివారం నాటి లోక్ అదాలత్ ద్వారా తన పార్టీషన్ సూట్ ఉపసంహారించుకుని, ఇకపై భవిష్యత్తులో కలసి ఉంటామని ప్రకటించారు.

ఈ సందర్బంగా జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి మాట్లాడుతూ, పరస్పరం రాజీ చేసుకోవడం కుటుంబ బంధాలు బలపడతాయాని అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా శనివారం మొత్తం మూడు వందల ముప్పై ఎనిమిది కేసుల్ని పరిష్కారం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, ఎపిపి ప్రణయ్, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దయ్య రాజారాం, లోక్ అదాలత్ మెంబెర్స్ వడ్డేపల్లి శ్రీనివాసన్, జేడి సుధాకర్, మీడియాషన్ కో ఆర్డినేటర్లు ఒజ్జెల శ్రీనివాస్, బక్కూరి రమేష్, న్యాయవాదులు పుప్పాల లింబాద్రి, పసునూరి సుదర్శన్, మామిడాల విజయలక్ష్మి, గడ్డం ప్రశాంత్ రెడ్డి, నీరటి రమణ, పడిగేలా శ్రీనివాస్, మన్నె గంగాధర్, సంజయ్, రజిత ఉన్నారు.

మరిన్ని వార్తలు