29 July, 2026 | 4:22 PM

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

29-07-2026 03:47 PM

న్యూఢిల్లీ: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు(Anti paper leak bill) లోక్ సభ బుధవారం ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో యాంటీ పేపర్ లీక్ బిల్లుకు ఆమోదం లభించింది. విపక్షాల ఆందోళనల మధ్యే యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం పొందింది. బిల్లును జీపీసీకి పంపాలని కొందరు ఎంపీలు డిమాండ్ చేశారు. ఎంపీలు ప్రతిపాదించిన సవరణలు వీగి పోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. బిల్లు ఆమోదం అనంతరం లోక్ సభ రేపటికి వాయిదా పడింది.

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన కాల్పులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బాధ్యుడన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణపై నిరసనలు, వాడివేడి చర్చల మధ్య లోక్‌సభలో 'పేపర్ లీక్ వ్యతిరేక బిల్లు' ఆమోదం పొందింది. ప్రభుత్వ పరీక్షల సమగ్రత, పారదర్శకత, విశ్వసనీయతను నిర్ధారించడంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను పేపర్ లీక్ నిరోధక బిల్లులోని సవరణలు ప్రదర్శిస్తున్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.