29 July, 2026 | 5:01 PM

ఎగువ మానేరు ప్రాజెక్టులోకి వరద నీరు

29-07-2026 04:22 PM
  1. - పాల్వంచ వాగు ద్వారా 1750 క్యూసెక్కుల నీటి ప్రవాహం

- వర్షాలతో రైతుల్లో ఆశలు చిగురింపు

గంభీరావుపేట,(విజయ క్రాంతి): గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు జలాశయంలోకి వరద నీరు భారీగా చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో కామారెడ్డి జిల్లా పరిధిలోని పాల్వంచ వాగు ద్వారా సుమారు 1750 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి ప్రవహిస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. రెండు రోజులుగా నిరంతర వర్షాలు కురుస్తుండటంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇదే విధంగా వరద నీటి ప్రవాహం కొనసాగితే వారం రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశముందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.