29 July, 2026 | 4:50 PM

మానవ అక్రమ రవాణాపై విద్యార్థినులకు అవగాహన

29-07-2026 04:07 PM

బోధన్,(విజయక్రాంతి): ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా సాధికారత కేంద్రం (DHEW), మిషన్ శక్తి ఆధ్వర్యంలో బోధన్ మండలం ఆమ్లుపూర్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీడీపీఓ నందిని మాట్లాడుతూ ఉద్యోగాలు, విదేశీ అవకాశాలు, సోషల్ మీడియా, ప్రేమ పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీఎంసీ స్వప్న హెల్ప్‌లైన్ సేవల వినియోగంపై వివరించగా, ప్యారా లీగల్ వాలంటీర్ పద్మ సింగ్ చట్టపరమైన హక్కులు, షీటీమ్ ప్రతినిధి జయంతి సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థినులు పాల్గొని మానవ అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు.