5 May, 2026 | 3:34 AM

లేడీస్ హాస్టల్ లో.. హిడెన్ కెమెరాలు.. బ్లూ మీడియా కల్పించిన కథనాలే

02-09-2024 04:53 PM

అమరావతి: ఇటీవల కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో లేడీస్ హాస్టల్ లో అమ్మాయిల వాష్ రూమ్ లో  సీక్రెట్‌ కెమెరాలున్నాయంటూ తీవ్రకలకలం  చెలరేగిన నేపథ్యంలో   స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ టీమ్ ను పంపించింది. ఈ మేరకు హాస్టల్ లో అణువణువు తనిఖీలు చేపట్టిన పోలీసులు అక్కడేమీ లేదని తేల్చారు. ఇదే అంశంపై ఇవాళ మంత్రి నారా లోకేశ్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో లేడీస్ హాస్టల్ బాత్‌రూంలో సీక్రేట్ కెమెరాలు ఉన్నాయన్నది బ్లూ మీడియా కల్పించిన కథనమేనని ఆయన పేర్కొన్నారు. సినీ నటిపై వైసీపీ నేతల వేధింపుల కేసు, మధ్యం స్కాం, భూ అక్రమాలు బయట పడడం వంటి అంశాలను ప్రజల మెమోరీనుంచి తొలగించడానికే హిడెన్ కెమెరాల నాటకానికి తెర లేపారని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు.  

 ఇంజనీరింగ్ కళాశాలలో లేడీస్ హాస్టల్ లో అమ్మాయిల వాష్ రూమ్ లో  సీక్రెట్‌ కెమెరాలున్నాయంటూ..ఈ  వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకొని కాలేజీ హాస్టల్‌కు చేరుకున్న పోలీసులు, ఆరోపణలు వచ్చిన ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.వారం క్రిత‌మే వెలుగులోకి వ‌చ్చినా కాలేజీ యాజమాన్యం ప‌ట్టించుకోలేద‌ని విద్యార్థినులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు  ప్రాధాన్యత సంతరించుకున్నాయి.