వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం వరద బాధిత ప్రాంతాలను సోమవారం పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాణ, ఆస్తి నష్టానికి ఆర్థిక సాయం ప్రకటించారు. పాడిపశువులు, గొర్రెలు, మేకలు, నష్టపోయిన వారికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. వరదల్లో ధ్రువపత్రాలు పోగొట్టుకున్న వారికి మళ్లి ఒరిజినల్స్ ఇస్తామని సీఎం తెలిపారు. రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నష్ట్రాన్ని అంచనా వేయాలని, నష్ట్రం అంచనా నివేదిక ఆధారంగా పరిహారం అందిస్తామన్నారు. వరద బాధితులకు రూ.10 వేలు తక్షణ సాయం, వరద మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, గొర్రెలు, మేకలు కోల్పోయిన వారికి రూ.5 వేలు సాయంఅందిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇళ్లు కోల్పోయిన వారికి ప్రధాని అవాస్ యోజన కింద ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వరదల వల్ల ఇప్పటివరకు 16 మంది మరణించారు. ఈ వరదలతో రూ.వేల కోట్ల ఆస్తి నష్టం, లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ వరదల వల్ల ఖమ్మం జిల్లా బాగా నష్టపోయిందని, 40 సెంటీమీటర్ల వర్షాన్ని ఎప్పుడూ చూడలేదని ప్రజలు అంటున్నారు. వరదల వల్ల రాష్ట్రంలో రూ.5,430 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఈ వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని కేంద్రాన్ని కోరామని సీఎ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.






