5 May, 2026 | 4:46 AM

శ్రీరాంసాగర్ 40 గేట్లు ఎత్తివేత

02-09-2024 04:51 PM

నిజామాబాద్‌: శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తి సోమవారం గోదావరి నదిలోకి 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాలు, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పరివాహక ప్రాంతాల నుంచి శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు సుమారు 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది. తొలుత అధికారులు 8 గేట్లను ఎత్తి 40 గేట్లకు పెంచారు. మరోవైపు కాకతీయ ప్రధాన కాల్వ, వరద ప్రవాహ కాలువలకు నీటిని విడుదల చేశారు. SRSP నీటి మట్టం 1088.8 అడుగులకు చేరుకుంది, పూర్తిస్థాయి రిజర్వాయర్ స్థాయి 1091.0 అడుగులు. నిల్వ సామర్థ్యం 72.610 టీఎంసీలకు చేరుకుంది. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని దిగువ ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు.