14 April, 2026 | 5:15 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

సమాన పనికి... సమాన వేతనం చెల్లించాలి

24-02-2026 06:38 PM

కుల రక్కసికి పసిపాప ప్రాణం పోవడం దారుణం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి

జవహర్ నగర్,(విజయక్రాంతి): సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని... కుల రక్కసికి పసిపాప ప్రాణం పోవడం దారుణమని... అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని స్త్రీ పురుష సమానత్వానికి మహిళలోకం సంఘటితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని పిఓడబ్ల్యు (విముక్తి) కన్వీనర్ పెరిక సునీత పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పీఓడబ్ల్యు (విముక్తి) సునీత ఆధ్వర్యంలో మంగళవారం కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ... ఆదివాసీ మహిళల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అన్నారు. మహిళల్ని గౌరవించే ప్రజాస్వామ్యంలో ఉన్న దేశం ఏఐ వంటి టెక్నాలజీతో దూసుకుపోతున్న మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదని విమర్శించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టు జాతీయ కన్వీనర్ షేక్షావలి, సంతోష్ నాయక్, రాణి, నందిని, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.