28 July, 2026 | 12:44 PM

పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్

28-07-2026 12:06 PM

హైదరాబాద్: ప్రముఖ నటి పావలా శ్యామల(75) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంళవారం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, అర్ధరాత్రి 1:52 గంటలకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. పావలా శ్యామల కుమార్తె ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతుండడంతో అంత్యక్రియల బాధ్యత 'మా' అసోసీయేషన్ తీసుకుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూత్త సొంత ఖర్చులతో ఆమె అంత్యక్రియలను నిర్వహిస్తుండగా, ఈ అంతిమ సంస్కారాల పూర్తి బాధ్యతలను ప్రముఖ నటి కరాటే కల్యాణి దగ్గరుండి చూసుకోనున్నట్లు సమాచారం. 1951లో గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించిన పావలా శ్యామల, రంగస్థల కళాకారిణిగా ప్రస్థానం ప్రారంభించి తెలుగు చిత్రసీమలో 300కు పైగా చిత్రాల్లో సహాయ, హాస్య పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. నాటక రంగం ద్వారా అడుగుపెట్టిన ఆమె, ‘స్వర్ణకమలం’, ‘ఖడ్గం’, ‘ఆంధ్రావాలా’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన ఆమె చివరి రోజుల్లో దీన స్థితిని గడిపారు. చికిత్స చేయించుకునేందు శ్యామల గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని వృద్ధాప్య సమస్యలతో జీవన పోరాటం సాగించారు.