బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా మాదాసు మొగిలి గౌడ్

27-09-2026 | 02:35pm

గణపురం, సెప్టెంబరు 27 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా గణపురం మండల కేంద్రానికి చెందిన మాదాసు మొగిలి గౌడ్ ను నియమించినట్లు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన మాదాసు మొగిలి మాట్లాడుతూ ఓబీసీ వర్గాల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చాను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.

తనకు బాధ్యత అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి, జన్నె మొగిలి, వెన్నంపల్లి పాపయ్య, కన్నం యుగేందర్, నాగపూరి రాజమౌళి గౌడ్, ఎరుకల గణపతి, దుప్పటి భద్రయ్య, దొంగల రాజేందర్, శివనాత్రి వేణు, మంద మహేష్ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు