17 April, 2026 | 2:15 PM

Breaking News

కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •  

మహాత్మ జ్యోతిబాపూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం

11-04-2025 08:41 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలోని అహమ్మద్ కళాశాలలో శుక్రవారం మహాత్మ జ్యోతిబాపూలే 199  వ జయంతి నీ ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు,చాత్రోపాధ్యాయులు జ్యోతిబాపూలే సమాజానికి చేసిన సేవలు కొనియాడారు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎండి హనీఫ్ పాషా  మాట్లాడుతూ   ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సామాన్యుడిగా మొదలై.. సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావి తరాలకు సైతం మార్గదర్శకుడని  గుర్తు చేసుకున్నారు. సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు స్త్రీవిద్యను తాను చేసిన సేవలను స్మరిస్తూ అతని జీవితం అందరికీ ఆదర్శనీయమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు.