13 May, 2026 | 1:39 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

సొమ్మసిల్లి పోతున్నవే..

22-02-2025 12:00 AM

సందీప్ కిషన్, త్రినాథరావు నక్కిన కాంబోలో రూపొందిన చిత్రం ‘మజాకా’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్‌లపై రాజేశ్ దండా, ఉమేశ్ కేఆర్ బన్సల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం నిర్మాతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫోక్ సాంగ్ ‘సొమ్మసిల్లి పోతు న్నావే’ను విడుదల చేశారు. ప్రైవేట్ ఆల్బమ్ ద్వారా తొలిసారిగా ప్రజాదరణ పొందిన ‘సొమ్మసిల్లి పో తున్నవే’ పాటను రీఇన్వెంట్ చేశారు.

లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ ట్రాక్, మోడరన్  బీట్‌లను సాంప్రదాయ జానపద సౌండ్స్ బ్లెండ్ చేసి, ప్రేక్షకులను అలరిస్తోంది. రాము రాథోడ్, ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన ఈ పాట  సాహిత్యం రస్టిక్  పదాలతో ఆకట్టుకుంది. రేవంత్ హై ఎనర్జీ వోకల్స్ పాటను మరింత ఎక్సయిటింగ్‌గా మార్చాయి. ఈ పాటలో సందీప్ కిష న్, రీతు వర్మ సంప్రదాయ దుస్తులలో అద్భుతంగా కనిపించారు. విజువల్స్ కలర్ ఫుల్‌గా ఉన్నాయి. మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 26న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.