02-02-2026 02:14:36 PM
... ఎమ్మెల్యే కోవలక్ష్మి
కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): మునిసిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి(Asifabad MLA Kova Lakshmi) ఆసిఫాబాద్ పట్టణంలోని జన్కపూర్ శ్రీ కోదండ రామాలయం ఆలయంలో మునిసిపల్ కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు వినాయక్ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు.
అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మునిసిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు ఇప్ప నాగరాజు, చిలువేరు వెంకన్న,రాపర్తి రవీందర్, చిలుకూరి శైలజా రవి, మాజీ సర్పంచ్ సరస్వతి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.