calender_icon.png 2 February, 2026 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక వడ్డీలతో శఠగోపం.. పట్టించుకోని అధికారులు

02-02-2026 02:13:06 PM

బంగారం, వెండి ఇస్తే అధిక వడ్డీలతో, డబ్బులు.

అధిక వడ్డీలతో వ్యాపారం చేస్తున్న, పట్టించుకోని అధికారులు.

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల(Thungathurthi Mandal) కేంద్రంలో ప్రజలు తమ అత్యవసర అవసరాల నిమిత్తం బంగారం, వెండి కుదవ పెట్టుకొని వ్యాపారం చేస్తున్న వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళితే, అధిక వడ్డీలతో సామాన్య ప్రజల నడ్డి విడుస్తు ఏకంగా శరగోపం పెడుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గడచిన పది సంవత్సరాల క్రితం వ్యాపారం కోసం వచ్చి, బంగారు షాపులు పెట్టుకుని, ప్రస్తుతం అధిక వడ్డీలతో వ్యాపారం నిర్వహించి అంచలంచెలుగా ఎదుగుతున్నారు.

గత సంవత్సరం రావుల పెళ్లి, అన్నారం, తుంగతుర్తి చెందిన కొందరు అత్యవసర డబ్బుల కోసం బంగారం వెండి ,కుదువ పెడితే, అసలు ,వడ్డీల పై వడ్డీలు వేసి, లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అధిక వడ్డీ తీసుకుంటున్న వారిపై చట్టరిత చర్యలు తీసుకోవాలని ఒక పక్క నిబంధనలు ఉన్నప్పటికీ ,సంబంధిత పోలీస్ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారుతూ, వడ్డీ వ్యాపారుల వ్యాపారం మాత్రం జోరుగా సాగుతున్నది. ప్రభుత్వ పరంగా ఎటువంటి లైసెన్స్ లేకుండా జరుగుతున్న సంఘటనల పట్ల, అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారిపై, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.