calender_icon.png 2 February, 2026 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణ ఘటన

02-02-2026 02:45:25 PM

మంటగలుస్తున్న మానవ సంబంధాలు ! 

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన  సిఎస్ఐ చర్చ్?

తల, మోకాలు కింది భాగం భాగం లేకుండా సంచులో కుక్కి బావిలో పడేసిన వైనం

కామారెడ్డి, ఫిబ్రవరి 2(విజయక్రాంతి): మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. అనడానికి  కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీఎస్ఐ గ్రౌండ్లో జరిగిన ఘటన నే నిదర్శనం. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ మాన వియ ఘటన మానవ సంబంధాలను ఏ విధంగా దూరం చేస్తున్న దో  నిదర్శనం గా చెప్పవచ్చు, సోమవారం ఉదయం 7-30 సమయంలో వేస్ట్ పేపర్ ఏరుకుంటూ వ్యక్తి సిఎస్ఐ గ్రౌండ్ ఆవరణ లో గల బావిలో తల, చాతి, మోకాలి కింది భాగాలు లేకుండా కేవలం నడుము కింది భాగం ఉండడం చూసి భయపడి పరిగెత్తుకుంటూ వస్తున్న గా చర్చికి సంబంధించిన వ్యక్తులు ఏంటని ప్రశ్నించగా తెరుకున్నాక విషయం చెప్పడంతో నిజమా కాదా అని వారు వెళ్లి చూసి దృవీకరించి తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. కామారెడ్డి పట్టణ సీఐ నరహరి హుటా హుటిన  ఘటన స్థలానికి వెళ్లి మృతదేహం భాగాన్ని  పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి  ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు సిఐ నరహరి తెలిపారు‌. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.