ట్రెండ్ సృష్టించే ‘హుషార్ పిట్టలు’
అన్షు, వాసవి గణేశన్ జంటగా రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేశ్ ఫిలింస్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రం నుంచి ‘టోంగా టోంగా..’ అనే ఓ హుషారు గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. చరణ్ అర్జున్ సంగీత దర్శకత్వంలో ఎస్‌ఎస్ చిరంజన్ సాహిత్యంతో, మెయిన్ కొరియోగ్రఫీతో ఈ పాట తెరకెక్కింది.
హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ సందర్భంగా హీరో అన్షు మాట్లాడుతూ.. “మా మూవీ టీజర్ చూసి అందరూ మిస్ అండర్‌స్టాండింగ్ చేసుకున్నారు. సినిమా చూసిన తర్వాత అందరి ఆలోచన మారిపోతుంది. సినిమాలో అసలైన మ్యాటర్ సినిమాలో ఉంది. నా సినిమాలో ఉన్న కంటెంట్ నాతో ఇంత కాన్ఫిడెన్స్‌ను ఇచ్చింది” అన్నారు.
హీరోయిన్ వాసవి గణేశన్ మాట్లాడుతూ.. “ఈ సినిమా టీజర్‌తో నాకు చాలా నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. అయితే వాసవి గణేశన్ వేరు.. పుట్ట చిట్టి వేరు.. ఎవ్వరు ఏమనుకున్నా సినిమా చూసిన తర్వాత మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా” అని తెలిపింది.
దర్శకుడు భిక్షు మాట్లాడుతూ.. “ఈ సినిమా టీజర్ తర్వాత నన్ను అందరూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ తిట్టడం ప్రారంభించి, నన్ను పాపులర్ చేశారు. అందరూ ఏదోదో ఊహించుకున్నారు. ఈ సినిమా విడుదల తర్వాత సినిమా చూసి అందరూ సోషల్ మీడియాలో చేసిన నెగెటివ్ కామెంట్స్ వెనక్కి తీసుకుంటారు. అయితే ఇదే సినిమాను ఏ తమిళంలో, మలయాళంలో తీసి టీజర్‌ను విడుదల చేస్తే అందరూ ప్రశంసించేవారు. కానీ తెలుగువాళ్లు మనకు చిన్నచూపు. పుట్ట చిట్టి పాత్రకు వాసవి ప్రాణం పోసింది. అందుకే ఆమె కాళ్లు మొక్కుతున్నా. తెలుగులో ‘హుషార్ పిట్టలు’ ట్రెండ్ సృష్టించబోతుంది. విడుదల తర్వాత ఇతర భాషల్లో ఈ తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటారు” అన్నారు.
నిర్మాత వెంకట్ యాదవ్ మాట్లాడుతూ.. “టీజర్ విడుదలైనప్పుడు వైరల్ అయ్యంది. కొంత మంది తెలియక బ్యాడ్ కామెంట్లు పెట్టారు. కానీ అందరి హృదయాలకు హత్తుకునే సినిమా ఇది. ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఈ కథలోని చిట్టి పిల్ల, మాసినెపల్లి రవి పాత్రలు అందరిని అలరిస్తాయి. ఎన్నో ఒడిదొడుకుల మధ్య ఈ సినిమా నిర్మించాను. ఎంతో ఫ్రొఫెషనల్‌గా తీసిన సినిమా ఇది. ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు విడుదల చేయడమంటేనే ఈ సినిమా ఎలాంటి సినిమానో అర్థం చేసుకొవచ్చు” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు గోవర్ధన్, నవీన్, అంజితోపాటు సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, డీవోపీ రుద్రసాయి, గీత రచయిత ఎస్‌ఎస్ చిరంజన్, బెక్కెం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.






