2 April, 2026 | 3:54 PM

Breaking News

నిరంతర సంక్షేమం.. అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం   •   ప్రజల భాగస్వామ్యంతో సంక్షేమ కార్యక్రమాలు   •   కేసీఆర్‌ను జైల్లో పెడతానన్న రేవంత్ — ఇప్పటివరకు ఏం చేశారు?   •   కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సాకారం..   •   పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •  

మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ

02-04-2026 02:14 PM

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మద్దతుగానే ఉందని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఈ విషయంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఇప్పటికే లేఖ రాశామని పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి, ఛైర్మన్ కు లేఖ రాశానని గుర్తుచేశారు. ఈ విషయంలో రాజకీయం చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఈ విషయాన్ని ఇంకా పొడిగించడం మంచిది కాదన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక చర్చ పెట్టండి.. అన్ని పక్షాలు పూర్తి మద్దతిస్తాయని సూచించారు. రాజ్యసభలో అమరావతి బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ విషయం ఏం చేశారని మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు.