17 April, 2026 | 5:22 PM

దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు

17-04-2026 03:40 PM

చీకట్లోనే అసలైన వాస్తవాలు

సమాజంలో మహిళలది కీలక పాత్ర

ప్రియాంక ప్రసంగం గర్వంగా అనిపించింది

న్యూఢిల్లీ: తల్లులు, చెల్లెళ్లు, భార్యలు.. ఇలా మన జీవితంలో మహిళలది కీలక పాత్రని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi Speech) మహిళా రిజర్వేషన్ల బిల్లుపై మాట్లాడుతూ అన్నారు. మహిళలే మన దేశ చోదక శక్తులన్నారు. నిన్న మా చెల్లి ప్రియాంకా గాంధీ ఇక్కడ మాట్లాడారు.. ఆమె ప్రసంగం ఓ అన్నగా నాకెంతో గర్వకారణం అన్నారు. మా నానమ్మ నాకెంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మా నానమ్మతో గడిపినప్పుడు .. నాకెంతో ధైర్యంగా ఉండేదన్నారు. చీకట్లోనే అసలైన వాస్తవాలు ఉంటాయని తెలిపారు. చీకట్లోకి వెళ్లి చూసేందుకు ధైర్యం చేయకపోతే మనం వాస్తవాలు తెలుసుకోలేమని రాహుల్ గాంధీ వివరించారు. మా నానమ్మ నన్ను గార్డెన్ కు తీసుకెళ్లినప్పుడు సత్యం, అహింస వంటి విషయాలు తెలియజెప్పేవారని వెల్లడించారు. నిజం కొన్ని సార్లు నొప్పిని కలిగిస్తుంది.. కానీ దానిని తట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అసలు ఇప్పుడు కొత్తగా మహిళా బిల్లు(Women Reservation Bill) పెట్టాల్సిన అవసరం లేదన్నారు. 2023లోనే మహిళా బిల్లును మనం ఆమోదించుకున్నామని తెలిపారు. ఇప్పుడు మహిళా బిల్లు మసుగులో దేశ రాజకీయ చిత్ర పటాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అంగా కావాలంటే పాత మహిళా బిల్లును రద్దు చేసి.. ఇప్పుడు మళ్లీ తీసుకురావాని కోరారు. బీసీ, దళితులు, మైనారిటీలు, మహిళలపట్ల ఈ బిల్లు ఈ బిల్లు క్షమించరాని, క్రూరమైన చర్యగా అభివర్ణించారు.  మేం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా దానికి మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఈ బిల్లు ద్వారా ఓబీసీ సోదరుల నుంచి అధికారం లాక్కునే ప్రయత్నం జరుగుతోందన్నారు. దేశంలో బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా కుట్రలు చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. హిందూ పార్టీ పేరు చెప్పుకుంటూ వారినే మోసం చేస్తున్నారని విమర్శించారు. దేశం ఆత్మను చంపే ప్రయత్నాన్ని అడ్డుకుంటామన్న రాహుల్ మహిళా రిజర్వేషన్‌ పేరుతో నరేంద్ర మోడీ మాయాజాలం చేస్తున్నారని ద్వజమెత్తారు.