నిజామాబాద్‌లో హైటెన్షన్..ఎమ్మెల్యే అరెస్ట్!
06-10-2026 | 11:33am
నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ పోలీస్ స్టేషన్లో నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పోలాస సుధాకర్ చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
సుధాకర్‌కు నివాళులు అర్పించేందుకు బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్ మృతితో బాల్కొండలో ఉద్రిక్తత నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.