అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
06-07-2026 12:08 AM
ఊర్కొండ, జులై 5: డలం పరిధిలోని ఇప్పపహాడ్ గ్రామంలో గోపాల్ (40) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్కు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఒకరికి ఇప్పటికే వివాహం కాగా, మరో ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కుటుంబ పోషణ బాధ్యతలను మోస్తున్న గోపాల్ ఒక్కసారిగా అనుమానాస్పదంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న ఎస్త్స్ర రమాదేవి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు






