6 July, 2026 | 2:18 AM

సత్తుపల్లి ఏరియా స్థాయి నిర్మాణాత్మక సమావేశం

06-07-2026 01:17 AM

ఏరియా ఉద్యోగుల సమస్యలపై చర్చించిన ఐఎన్టీయూసీ

సత్తుపల్లి, జూలై 5 (విజయక్రాంతి): సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం స్ట్రక్చర్ సమావేశం జి.ఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించారు.సత్తుపల్లి ఏరియా పరిధిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏరియా అధికారులతో జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో ఐ.ఎన్.టి.యూ.సీ నాయకులు కోరారు.స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు.

ముఖ్యంగా సత్తుపల్లి జి.ఎం కార్యాలయంలో పర్సనల్ డిపార్ట్మెంట్ , ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి ఏర్పాటు , ఉద్యోగుల నివసించే కాలనీలో  కమ్యూనిటీ హాల్ ఏసి లు ఏర్పాటు , ఇండోర్ స్టేడియం ప్రారంభించాలని , చిల్డ్రన్ పార్క్ , కాంపౌండ్ వాల్ ఎత్తు పెంపు మరియు చుట్టు లైటింగ్ ఏర్పాటు చేయాలని ,   ఐ.ఈ.డి స్టడీ ప్రకారం సత్తుపల్లి ఏరియా లో మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్లు సర్దుబాటు చేయాలని కోరారు. అదేవిధంగా గతంలో జరిగే స్ట్రక్చర్ మీటింగ్ అంశాలపై చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

ప్రాతినిధ్య సంఘం నాయకులు ప్రస్తావించిన పనులను పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కృషి చేస్తుందని , ఇప్పటివరకు ఏ విధంగా ఉత్పత్తి లక్ష్యసాధనలో సహకరించారో ఇకముందు కూడా సహకరించి సంస్థ పురోఅభివృద్ధిలో తోడ్పడాలని జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్  కోరారు.

ఈ కార్యక్రమంలో ఏరియా అధికారులు బొల్లం శ్రీనివాస్ ( ఎస్ ఓ టు జి.ఎం ) ,   ప్రహ్లాద్ ( ప్రాజెక్ట్ ఆఫీసర్ , జే.వి.ఆర్ ఓసి ) , సునీల్ వర్మ ( ప్రాజెక్ట్ ఆఫీసర్ , కిష్టారం ఓసి ) , శ్రీనివాస్ రావు ( ప్రాజెక్ట్ ఇంజినీర్ ) , సోమశేఖర్ ( ఏరియా ఇంజనీర్ ) , తిరుపతి ( పర్సనల్ ఆఫీసర్ ) , సురేష్ ( డీజీఎం , జే.వి.ఆర్ సి.హెచ్.పి ) , ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు , సివిల్ డిపార్ట్మెంట్ అధికారులు , సంక్షేమ అధికారులు కావ్య , శ్రీనివాస్ ఇతర డిపార్ట్మెంట్ల అధికారులు ,  ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘం నాయకులు క్రాంతి కుమార్ , కోటేశ్వరరావు , నాగ ప్రకాష్ పాల్గొన్నారు.