ఘనంగా ప్రపంచ వయోవృద్దుల దినోత్సవ వేడుకలు

01-10-2026 | 07:13pm

మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ(State Legal Services Authority), జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశానుసారం మంచిర్యాలలోని ఆనంద నిలయం(Anand Nilayam) వృద్ధాశ్రమంలో గురు వారం ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని(World Elders Day) జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కవిత మాట్లాడుతూ వయో వృద్ధులకు హక్కులను, సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, వాటికి అనుగుణంగా వయోవృద్ధులందరికి కూడా ఉచితంగా వైద్య సేవలు, వృద్ధాప్య పింఛన్లు, న్యాయ సేవా అధికార సంస్థ తరఫున న్యాయ సేవలను ఉచితంగా అందిస్తుందన్నారు. 

వయోవృద్ధులను వారి కుటుంబ సభ్యులు ఆదరించకపోవడం వల్ల వారు ఈ వృద్ధాశ్రమంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వాలు వారికి ప్రత్యేక చట్టాన్ని 2007లో తీసుకువచ్చిందని, ఎవరైన కుటుంబ సభ్యులు వయోవృద్ధుల బాగోగులు చూడకపోయినట్లయితే వారు శిక్ష్యార్హులన్నారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే 1510 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి న్యాయ సలహాలు పొందవచ్చన్నారు. అనంతరం వయోవృద్ధులకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి నరేందర్ రాథోడ్, జిల్లా వయోవృద్దుల సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, చీప్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ ఎండి సంధాని, శ్రీనివాస్, రెడ్డి రాజుల రాములు, సదయ్య, మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది, రెడ్ క్రాస్ సొసైటీ సొసైటీ సభ్యులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు