డీజీపీతో మంద కృష్ణ మాదిగ భేటీ
శుభాకాంక్షలు తెలిపిన పలువురు
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి) : రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మార్యాద పూర్వకంగా మర్యాదపూర్వకంగా కలిశారు. సీవీ ఆనంద్ డీజీపీగా నియా మకం కావడంతో గురువారం డీజీపీ కార్యాలయానికి వెళ్లిన కృష్ణ మాదిగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మొదటి దశ ఉద్యం ఉవ్వెత్తున్న జరగుతున్న సమయంలో బషీర్‌బాగ్‌లో చౌరస్తాలో పోలీసు అధికారిగా విధులు నిర్వహించిన విషయాన్ని సీవీ ఆనందర్ గుర్తు చేశారు.
పోలీస్ శాఖలో అపారమైన అనుభవం కలిగిన సీవీ ఆనం ద్ డీజీపీకి నియామకం కావడం సంతోషకరమని కృష్ణ మాదిగ అన్నారు. డీజీపీని కలిసి వారిలో మహజన సోషలిస్టు పార్టీ జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ, ప్రముఖ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, సినిమా దర్శకులు ప్రేమ్‌రాజ్, ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బైరపోగు శివకుమార్ తదితరులున్నారు.






