సాతారంలో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
మల్లాపూర్,(విజయక్రాంతి): మండలంలోని సాతారం గ్రామంలో మండల స్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా జువ్వాడి కృష్ణారావు, సాతారం గ్రామ సర్పంచ్ పోతవేణి కిషన్ గౌడ్, ఎంపీడీఓ శ్రీకాంత్, ఎంఈఓ దామోదర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి అతిథులు మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, టీమ్ స్పిరిట్‌ను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ఎల్లాల జలపతి రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పుష్పలత నర్సయ్యతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.