నాగల్‌గిద్దలో వివాహిత అదృశ్యం
మిస్సింగ్ కేసు నమోదు
నాగల్‌గిద్ద: నాగల్‌గిద్ద గ్రామానికి చెందిన కైకాడి కల్పన (24) అనే వివాహిత అదృశ్యమైన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్(woman missing) కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, కైకాడి కల్పన యెరుకల సామాజిక వర్గానికి చెందిన గృహిణి. ఆమె ఎత్తు సుమారు 5 అడుగులు, గోధుమ వర్ణం, గుండ్రని ముఖం, నల్లటి జుట్టు కలిగి ఉంటుంది. ఇంటి నుంచి వెళ్లే సమయంలో ఆకుపచ్చ రంగు పంజాబీ టాప్, నల్లరంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెకు తెలుగు, హిందీ భాషలు మాట్లాడటం తెలుసు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు వెంటనే నాగల్‌గిద్ద పోలీస్ స్టేషన్‌ను లేదా ఎస్‌ఐ రామకృష్ణను 87126 56762 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.






