బాన్సువాడలో పట్టపగలే భారీ చోరీ...
29.05 తులాల బంగారం, ఐదువేల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు..
బాన్సువాడ, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ(Banswada) పట్టణంలో పట్టపగలే భారీ చోరీ జరిగిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే బాన్సువాడ పట్టణంలోని షేక్ చాంద్ హోటల్ సమీపంలో ఉన్న చింతల భాస్కర్ ఇంట్లో పట్ట పగలు తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగిందనీ బాధితుడు బాన్సువాడ పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు చింతల భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం ఇంటికి తాళం వేసి భార్యతో పాటు తన కిరణం దుకాణానికి వెళ్ళారు.
కాసేపటి తర్వాత చింతల భాస్కర్ ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది లోపల వెళ్ళి చూడగా బీరువా తెరిచి ఉంది బీరువా లో ఉన్న బంగారు నగలు 29 తులాల బంగారం, ఐదు వేల నగదు, వెండి పోయినట్లు గుర్తించిన బాధితుడు వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సోమవారం ఉదయం పట్టణ సీఐ తుల శ్రీధర్ సంఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన స్థలాన్ని పరిశీలించారు. చోరీ జరిగిన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు.