16 April, 2026 | 2:26 AM

17న పెద్దపల్లిలో భారీ ఉద్యోగ మేళా నిర్వహణ

16-04-2026 12:58 AM

కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, ఏప్రిల్- 15(విజయ క్రాంతి) నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ నెల 17 ఏప్రిల్ 2026న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రత్యేక జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.టాస్క్ (TASK) రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ డ్రైవ్లో ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని,ఈ నెల 17న శుక్రవారం ఉదయం 10:00 గంటల నుంచి పెద్దపల్లి టాస్క్ (TASK) రీజినల్ సెంటర్, పెద్దపల్లి బస్టాండ్ సమీపంలో గల టాస్క్ సెంటర్ లోడిప్లొమా,ఐటీఐ,ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగాలకు అర్హులని,

ఈ డ్రైవ్లో ఏజే సొల్యూషన్, వార్కస్ ఈవీ మోటార్స్), మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల ప్రతినిధులు పాల్గొని, ఇంటర్వ్యూల నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు.

ఆసక్తి గల అభ్యర్థులు తమ వెంట రెండు సెట్ల లేటెస్ట్ రెజ్యూమ్, అభ్యర్థులు తప్పనిసరిగా ఫార్మల్ డ్రస్లో ఇంటర్వ్యూకు హాజరు కావాలని, నిర్ణీత సమయం కంటే ముందుగానే వేదికకు చేరుకోవాలని, జిల్లాలోని అర్హత కలిగిన యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ కంపెనీలలో ఉద్యోగాలు పొందాలని, మరిన్ని వివరాల కోసం పెద్దపల్లిలోని టాస్క్ రీజినల్ సెంటర్లో సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.