18 April, 2026 | 3:44 AM

టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం

18-04-2026 01:00 AM

కెనడా, కివీస్ మ్యాచ్‌పై ఐసీసీ దర్యాప్తు

దుబాయి, ఏప్రిల్ 17: భారత్, శ్రీలంక వేదికలుగా జరిగిన టీ20 ప్రపంచకప్ ముగిసి నెలన్నర రోజులు దాటింది. ఈ మెగాటోర్నీలో భారత్ ఛాంపియన్‌గా నిలిస్తే, న్యూజిలాండ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

దీంతో న్యూజిలాండ్ జట్టు కెనడాతో ఆడిన మ్యాచ్ పై ఐసీసీ అవినీతి నిరోధక శాఖ దృష్టి పెట్టింది. కెనడా జట్టుపై విచారణ ప్రారంభించింది. కెనడా క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడిందంటూ ఇటీవలే ఓ డాక్యమెంటరీ పేర్కొంది. దీంతో అప్రమత్తమైన ఐసీసీ విచారణ ప్రారంభించింది.

క్రికెట్ కెనడాకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ ఆధ్వర్యంలో రెండు ఇన్వెస్టిగేషన్స్ టీమ్స్ విచారణ మొదలుపెట్టాయని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మ్యా చ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన కెనడా 17 3 పరుగులు చేసింది. తర్వాత ఛేజింగ్‌లో న్యూజిలాండ్ 15.1 ఓవర్లలోనే 2 వికెట్లు మా త్రమే కోల్పోయి గెలుపొందింది. అయితే  కె ప్టెన్ దిల్ప్రీత్ బజ్వా వేసిన ఐదో ఓవర్ అనుమానాస్పదంగా ఉందని కెనడాకు చెందిన ఇ న్వెస్టిగేటివ్ కార్యక్రమం ది ఫిఫ్త్ ఎస్టేట్ తెలిపింది.

కేవలం టోర్నీకి మూడు వారాల ముందే బజ్వాను కెనడా సారథిగా బోర్డు ని యమించింది. నాలుగు ఓవర్లలో స్కోరు 35/2గా ఉన్నప్పుడు బజ్వా 15 పరుగులు ఇచ్చాడు. ఇక్కడ నుంచి మ్యాచ్ స్వరూపమే మారిపోయిందని సదరు డాక్యమెంటరీ ఆ రోపిస్తోంది.  అయితే.. ఇలాంటివాటిపై త మ ఏసీయూ ఇప్పటికిప్పుడు స్పందించే స్థితి లో లేదని ఐసీసీ తాత్కాలిక జీఎం ఆండ్రూ ఎఫ్గ్రేవ్ తెలిపారు. విచారణ తర్వాతే అసలు విషయం తేలుతుందని వెల్లడించారు. ఇక జట్టు ఎంపికకు సంబంధించి మాజీ కెనడా కోచ్ ఖుర్రమ్ చోహాన్ పాత్ర పైనా విచారణ చేపట్టే అవకాశం ఉంది.