16 April, 2026 | 10:14 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

05-02-2026 12:02 AM
  1. ఆర్ అండ్ బీ, పోలీసు అధికారులు సమన్వయంతో ప్రమాదాలను అరికట్టాలి

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట క్రైం, ఫిబ్రవరి 4 : నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివా రణకు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పష్టం చేశారు. ఆర్ అండ్ బి, నేషనల్ హైవే ,పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ ( ప్రమాదకర ప్రదేశాలు) లో  ఇకపై ప్రమాదా లు జరగకుండా రోడ్ సేఫ్టీ ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు.

బుధవారం జిల్లా క లెక్టరేట్ లోని వీసీ హాల్ లో ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  నారాయణపేట నియోజక వర్గ పరిధిలోని ప్ర మాదకర ప్రదేశాల్లో అర్ అండ్ బీ అధికారు లు, మక్తల్ నియోజకవర్గంలో నేషనల్ హైవే అథారిటీ అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన కార్యాచరణ ప్రణాళిక లు రూపొందించుకొని  నెల రోజులలో ఆయా బ్లాక్ స్పాట్ లలో ప్రమాద నివారణనే ల క్ష్యంగా సాగాలన్నారు.

సమావేశంలో ఆర్ అం డ్ బీ అధికారులు పోలీసు శాఖతో కలిసి జిల్లాలోని బ్లాక్ స్పాట్ ల వద్ద ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను జిల్లా కలెక్టర్,ఎస్పీలకు చూ పించారు. పోలీసు, మున్సిపల్ శాఖల అధికారులు సూచించిన ప్రమాద నియంత్రిక లను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు తెలిపారు.

అలాగే పోలీసు శాఖ తరపున డీఎస్పీ నల్లపు లింగయ్య కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో గడచిన మూడేళ్లలో (2023 నుంచి 2025 వరకు) జిల్లాలో  గుర్తించిన 10 బ్లాక్ స్పాట్ ( నారాయణపేట , మక్తల్, మరికల్ లో )మొత్తం  101 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఆయా ప్రమాదాలలో 64 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని కలెక్టర్, ఎస్పీకి వెల్లడించారు.

ఇకపై   నారాయణపేట పట్టణం, మక్తల్, మరికల్ పట్టణాలతో పాటు ఆయా సర్కిల్ లలో  రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు  తీసుకోవాల్సిన చర్య లు, జాగ్రత్తలు, ప్రమాద నియంత్రికల ఏర్పా టు కు  ఆర్ అండ్ బీ, ఎన్. హెచ్ అధికారుల సహాకారం తీసుకుంటామని డీఎస్పీ  తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రి యాజ్ హూల్ హాక్, ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటరమణ, ఆర్టీవో మేఘా గాంధీ, ఆర్టీవో నెంబర్ పోషల్ రాజేష్, డిపో మేనేజర్ లా వణ్య, ఎన్ హెచ్ అధికారి, ఆర్ అండ్ బి డీ.ఈ. తదితరులు పాల్గొన్నారు.