కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో జిల్లాకు పతకాలు

21-09-2026 | 02:09pm

సత్తా చాటిన షాలిన్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 21 ( విజయ క్రాంతి ): ఈనెల 20వ తేదీ ఆదివారం మంచిర్యాల జిల్లా సోమగూడెం త్రినేత్ర గార్డెన్(Trinetra Garden) హలులో కేఆర్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్ షిప్(Karate Championship) పోటీలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన షాలిన్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు పాల్గొని పతకాలు సాధించినట్లు అకాడమీ ఫౌండర్, డైరెక్టర్, సీనియర్ మాస్టర్ కరాటే శ్రీనివాస్ ( మాదాసి ) తెలిపారు.

ఈ సందర్భంగా మాస్టర్ శ్రీనివాస్ కటాస్ విభాగంలో విధిష దేవి, ఆరాధ్య, నివేదన గోల్డ్ మెడల్స్, జాహ్నవి, తనూశ్రీ, అనుభవ్ సిల్వర్ మెడల్స్, స్నేహజ, హిమన్ష్, శ్రేయన్స్ బ్రంజ్ మెడల్ సుషాన్, స్నేహజ, కౌశిక్ బ్రాంజ్ మెడల్స్ సాధించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా స్పారింగ్ విభాగంలో విధిష దేవి, కౌశిక్, తనూశ్రీ గోల్డ్ మెడల్స్, శ్రేయన్స్, అనుభవ్, ఆరాధ్య సిల్వర్ మెడల్స్, సుషాన్, స్నేహజ, జాహ్నవి, నివేదన, హిమాన్ష్ బ్రాంజ్ మెడల్స్, వెపన్ కటాస్ విభాగంలో తనూశ్రీ గోల్డ్ మెడల్ సాధించినట్లు తెలిపారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను మాస్టర్లు శ్రీనివాస్, అశోక్ లను పోటీల నిర్వాహకులు కుందేల రవి, ప్రసాద్, సీనియర్ మాస్టర్లు నారాయణ, మహేష్, శివ మహేష్, అన్వర్ ప్రత్యేకంగా అభిందించినట్లు ఈ సందర్భంగా మాస్టర్ శ్రీనివాస్ తెలిపారు.

మరిన్ని వార్తలు