calender_icon.png 31 August, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలసేమియా వ్యాధిగ్రస్తులకు మందులను ఉచితంగా అందించాలి

31-08-2025 06:43:06 PM

మందమర్రి,(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల సేమియా సికిల్ సెల్ వ్యాధి గ్రస్తులకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా మందులను అందించాలని తెలిసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆయన నివాసం లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో తల సేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు సుమారు  12,000 మంది ఉన్నారని, ఈ వ్యాధి జన్యు పరంగా వంశపారం పర్యంగా వచ్చే వ్యాధి అని  దీర్ఘకాలికంగా ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యాధిగ్రస్తులు జీవితాంతము మందులు వాడాల్సి ఉంటుందని హైడ్రా క్స్యూరియా, సోడామింట్, పెంటేడ్స్, వంటి టాబ్లెట్లు ప్రభుత్వము ఉచితంగా అందించాలనీ కోరారు. నార్మల్ మందులను ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని అదేవిధంగా తల సేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులందరికీ ఉచితంగా మందులు అందించాలని కోరారు. ఈ మందులను రాష్ట్రంలోని ప్రతి జిల్లా హాస్పిటల్, పీహెచ్సీలో అందుబాటులో ఉంచి ఆశా వర్కర్ల ద్వారా గ్రామాలలో ఉన్న సికిల్ సెల్ వ్యాధి గ్రస్తులకు అందజేయాలన్నారు.  ప్రాణాంతకమైన తల సేమియా వ్యాధి ఆదివాసి గిరిజన  జిల్లాలలో ఎక్కువగా ఉంటుందని దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా  మందులను ఉచితంగా అందించాలని కోరారు.