17 April, 2026 | 3:23 AM

మెడికవర్ హాస్పిటల్స్ అరుదైన ఘనత

17-04-2026 12:00 AM

ఇద్దరు చిన్నారులకు గుండె, కణితి శస్త్రచికిత్సలు విజయవంతం!

హైదరాబాద్, ఏప్రిల్ (విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్స్‌లో అరుదైన, క్లిష్టమైన రెండు పీడియాట్రిక్ కేసులను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ కేసులు అధిక నైపుణ్యం, ఖచ్చితత్వం అవసరమైనవిగా వైద్యులు తెలిపారు. 8 సంవత్సరాల బాలిక  శ్వాసలో ఇబ్బంది, మెడ నొప్పితో ఆసుపత్రికి వచ్చింది.

మెడ, స్పైన్‌కు ఎంఆర్‌ఐ పరీక్షలు నిర్వహించగా, ఛాతి వెనుక భా గంలో 11.6 x 10.6 x 8.7 సెం.మీ పరిమాణంలో భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు.ఈ కణితిని తొలగించకుండా వదిలేస్తే అది మ రింత పెరిగి స్పైనల్ కార్డ్‌పైఒత్తిడి పెంచి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. ప్రధాన రక్త నాళాలపై ప్రభావం చూపి ప్రాణాపాయం కలిగించే అవకాశం కూడా ఉంది.ఈ క్లిష్ట పరిస్థితిలో డాక్టర్ ప్రమోద్ రెడ్డి కందకురే (చీఫ్ కార్డియోథొరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జన్), న్యూరో సర్జన్ డాక్టర్ అనీల్‌తో కలిసి శస్త్రచికిత్స నిర్వహించి సుమారు 500 గ్రాముల కణితిని విజయవంతంగా తొలగించారు.

శస్త్రచికిత్స అనంతరం బాలికలో ఎటువంటి నర సంబంధిత లోపాలు లేకుండా స్థిరంగా కోలుకుంటోంది. బయాప్సీ నివేదిక ప్రకారం ఇది గ్యాంగ్లియోన్యూరోమాగా నిర్ధారణ అ యింది, ఇది కాన్సర్ కాని అరుదైన ట్యూ మర్. మరో కేసులో, 4 సంవత్సరాల బాలు డు పుట్టినప్పటి నుంచే పెదాలు, గోర్లు నీలం రంగులో కనిపించడం, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలతో ఆసుపత్రికి వచ్చాడు.పరీక్షల్లో అతనికి సింగిల్ వెంట్రికల్ ఫిజియాలజీ అనే అరుదైన గుండె లోపం ఉన్నట్లు గుర్తించారు.

గుండె నాలుగు గదులుగా అభివృద్ధి చెందకపోవడం వల్ల రక్తంలో ఆక్సిజన్ సరైన స్థాయిలో చేరడం లేదు.ఈ పరిస్థితికి చికిత్స అందించకపోతే బాలుడిలో ఆక్సిజన్ స్థాయి లు మరింత తగ్గిపోవడం, ఎదుగుదల మం దగించడం, తీవ్రమైన గుండె సమస్యలు ఏర్పడడం వంటి ప్రాణాపాయకర పరిణామాలు కలగవచ్చు.వైద్య బృందం బాలుడికి క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స నిర్వహించింది. శ స్త్రచికిత్స అనంతరం అతని రక్తంలో ఆక్సిజ న్ స్థాయిలు మెరుగుపడి, శారీరక సామర్థ్యం పెరిగింది.డాక్టర్ ప్రమోద్‌రెడ్డి కందకురే మాట్లాడుతూ, ఈ రెండు కేసులు వైద్యపరంగా అత్యంత క్లిష్టమైనవి, సమగ్ర ప్రణాళిక, ఖచ్చితత్వం అవసరమైనవి.

మొదటి కేసులో కణితి స్పునల్ కార్డ్, ప్రధాన రక్తనాళమైన అయోర్టాకు అత్యంత సమీపంలో ఉండటంతో శస్త్ర చికిత్స ప్రతి దశలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వ చ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పొరపా టు జరిగినా పక్షవాతం లేదా తీవ్రమైన రక్తస్రావం వంటి ప్రమాదాలు సం భవించే అవకాశం ఉంటుంది.అలాగే రెండో కేసులో ఉన్న సింగిల్ వెంట్రికల్ గుండె లోపం ప్రతి రోగిలో భిన్నంగా ఉండే సంక్లిష్ట సమస్య. ఈ రకమైన కేసుల్లో ఒకే విధమైన చికిత్స ఉం డదు, రోగి శరీర నిర్మాణం,రక్తప్రసరణ విధా నం ఆధారంగా వ్యక్తిగతంగా ప్రణాళిక సిద్ధం చేయాలి.

శస్త్రచికిత్స ద్వారా శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపరచడం ప్రధాన లక్ష్యం. ఈ రెండు సందర్భాల్లోనూ మల్టీడిసిప్లినరీ టీమ్ సమన్వయం, ఆధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య బృందం వల్లే విజయవంతమైన ఫలితాలు సాధించగలిగాం. ముఖ్యంగా, ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయ కుం డా త్వరగా వైద్యులను సంప్రదించడం చా లా అవసరమని తెలిపారు.

న్యూరో సర్జన్ డా.అనీల్ మాట్లాడుతూ, స్పునల్ కాల్కు సమీపంలో ఉన్న కణితులను తొలగించే సమయంలో నరాలను కాపాడటం అత్యంత ముఖ్యమైనది. సమన్వయంతో శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. సకాలంలో పరీక్షలు చేయించుకోవడం, లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ద్వారా ఇలాంటి క్లిష్ట పరిస్థితులను నివారించవచ్చని సూచించారు.