17 April, 2026 | 3:22 AM

న్యూరోసర్జరీలో రోబోటిక్ మైక్రోస్కోప్ ప్రారంభం

17-04-2026 12:00 AM

బేగంపేట కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌లో ఏర్పాటు

హైదరాబాద్, ఏప్రిల్ 16(విజయక్రాంతి): బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌లో అత్యాధునిక జైస్ కినెవో 900 రోబోటిక్ మైక్రోస్కోప్‌నుప్రవేశపెట్టి, ఖచ్చితత్వంపై ఆ ధారపడి జరిగే న్యూరోసర్జరీలో ఒక కీలక ముందడుగు వేసింది. ఈ ఆధునిక సాంకేతికతతో క్లిష్టమైన మెదడు, వెన్నెముక శస్త్రచికి త్సల్లో భద్రత, ఖచ్చితత్వం ఫలితాలను మెరుగుపరుస్తుంది.

ప్రస్తుతం ఇలాంటి ఆధునిక రోబోటిక్ మైక్రోస్కోప్ దేశవ్యాప్తంగా కొద్ది కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నా యి. కినెవో 900 రోబోటిక్స్, హై-డెఫినిషన్ ఇమేజింగ్, స్మార్ట్ ఫీచర్లను సమన్వయం చేసి, క్లిష్టమైన శస్త్రచికిత్సల సమయంలో శస్త్రచికిత్స నిపుణులకు మద్దతు ఇస్తుంది. కోబో టిక్స్ (సహకార రోబోటిక్స్)గా పిలువబడే ఈ విధానంతో వైద్యులు మరింత ఖచ్చితత్వంతో, నమ్మకంతో శస్త్రచికిత్సలు నిర్వ హిం చగలుగుతున్నారు. గురువారం బేగంపేటకిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌లో ప్రెస్‌మీట్ నిర్వ హించారు.

న్యూరోసర్జరీలో కోబోటిక్ మైక్రోస్కోప్‌ను డాక్టర్ ఏవీ గురవ రెడ్డి (చీఫ్ రో బోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, చైర్మన్ సన్‌షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూ ట్, మేనేజింగ్ డైరెక్టర్, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్)ప్రారంభించారు. పాయింట్‌లాక్, పొ జిషన్ మెమొరీ వంటి ఫీచర్లు సున్ని తమైన శస్త్రచికిత్స ప్రాంతాలపై స్థిరమైన ఫోకస్‌ను కొనసాగించడంలో సహాయపడతాయి.   డా క్టర్ నవీన్ మెహ్రోత్రా (సీనియర్ కన్సల్టెంట్ న్యూరోఅండ్ స్పైన్ సర్జన్) మాట్లాడుతూ 3డీ, 4కే విజువలైజేషన్‌తో శస్త్రచికిత్స బృం దం మొత్తం ప్రక్రియను అత్యంత స్పష్టంగా గమనించగలదు.

అదనంగా, క్యూఈవీఓ మైక్రో-ఇన్‌ఫెక్షన్ సాధనం ద్వారా దాగి ఉన్న శరీర నిర్మాణ భాగాలను కూడా చూడొచ్చు, దీని వల్ల శస్త్రచికిత్స భద్రత, సంపూర్ణత మెరుగుపడుతుంది. డాక్టర్ సీహెచ్ గోపాల్ (సీని యర్ కన్సల్టెంట్ న్యూరో ఫిజీషియన్) ఆధునిక ఇమేజింగ్ సాంకేతికతల ప్రయోజనాలు తెలిపారు. హాస్పిటల్‌కు చెందిన న్యూరోసైన్సె స్ బృందం డాక్టర్లు మోహన శశాంక్ దీవి, వినోద్ కుమార్, నివేదిత సాయిచంద్ర తమ విలువైన అభిప్రాయాలు పంచుకున్నారు.