19 August, 2026 | 8:27 PM

మొక్కలు నాటిన మెగా యూత్

19-08-2026 07:57 PM

చెన్నూర్,(విజయక్రాంతి): మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా యూత్ ఫోర్స్ మంచిర్యాల జిల్లా నాయకుడు సిద్దు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజక వర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధ వారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ కాసరాజు, చెన్నూర్ టీం సీనియర్ జనసేన నాయకులు రాజా రవికిరణ్, బాలు, సాయి మామిడి, రఘు, సాయి కిరణ్, పొన్నం సాయి, సాయి ఆడేటి, చెన్నూర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలగం సాయికుమార్, పాఠశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.