20 June, 2026 | 2:35 AM

రౌండ్ 32కు మెక్సీకో క్వాలిఫై

20-06-2026 12:00 AM

ఎస్టాడియో, జూన్ 19: ఫిఫా ప్రపంచకప్‌లో మెక్సికో అదరగొడుతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఆ జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. గ్రూప్ ఏ లో భాగంగా దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో మె క్సికో 1-0 తేడాతో గెలుపొందింది. అంతా ఊ హించినట్టుగానే ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది.

రెండు పటిష్ఠమైన జట్ల మధ్య పో రు అభిమానులకు కిక్ ఇచ్చింది. ఫస్టాఫ్ లో గోల్స్ నమోదు కాలేదు. రెండో అర్ధభాగం ప్రారంభమైన ఐదు నిమిషాలకే తొలి గోల్ నమోదైంది. 50వ నిమిషంలో గోల్ సాధించిన రోమో మెక్సికో జట్టులో హీరోగా నిలి చాడు. చివర్లో కొరియా రెండుసార్లు గో ల్ చేసేందుకు చేరువగా వెళ్లినా మెక్సికో సమర్థంగా అడ్డుకుంది. తాజా విజయంతో ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో రౌండ్ ఆఫ్ 32కు అర్హ త సాధించిన తొలి జట్టుగా మెక్సికో నిలిచింది.