20 June, 2026 | 2:35 AM

కెనడా చేతిలో ఖతార్ చిత్తు

20-06-2026 12:00 AM

వాంకోవర్, జూన్ 19: ఫిఫా ప్రపంచకప్‌లో కెనడా దుమ్మురేపింది. సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో కెనడా 6-0 గోల్స్ తేడాతో ఖతార్‌ను చిత్తు చేసింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే కెనడా జట్టుకు ఇదే మొట్టమొదటి విజయం. ప్రపంచకప్ మ్యాచ్‌లో ఒక ఆతిథ్య దేశం ఆరు గోల్స్ చేయడం 1978 తర్వాత ఇదే తొలిసారి.

కెనడా స్టార్ స్ట్రైకర్ జొనాథన్ డేవిడ్ ఈ మ్యాచ్‌లో అదరగొట్టాడు. కెనడా తరఫున ప్రపంచకప్‌లో మొ దటి హ్యాట్రిక్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృ ష్టించాడు. కాగా మ్యాచ్ ముగిసే సమయానికి ఖతార్ కేవలం 9 మంది ఆటగాళ్ల తోనే ఆడాల్సివచ్చింది. మ్యాచ్ అ నంతరం మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.