23 May, 2026 | 6:18 AM

ఆదిత్య ఠాక్రేపై మిళింద్ దేవరా పోటీ

29-10-2024 12:48 AM

ప్రకటించిన ఏక్‌నాథ్ షిండే పక్షం శివసేన

ముంబై, అక్టోబర్ 28: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను జాబితాను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏక్‌నాథ్ షిండే వర్గ మిళింద్ దేవరా పేరును సోమవారం ప్రకటించింది. మిళింద్ దేవరా వర్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. 2019 ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే కుమారుడైన ఆదిత్య ఠాక్రే వర్లీ నియోజవర్గం నుంచి మంచి మెజారిటీతో గెలుపొం దారు. ఈ ఎన్నికల్లో ఆదిత్య ఠాక్రేను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తున్న ఏక్‌నాథ్ షిండే వర్గం ప్రత్యర్థిగా మిళింద్ దేవరాను ఖరారు చేసింది. రాజ్యసభ ఎంపీ అయిన మిళింద్ దేవరా ఈ ఏడాది ప్రారంభంలో కాంగ్రెస్‌ను వీడి ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేనలో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వర్లీ నియోజవర్గ బాధ్యతలు తీసుకున్నారు.