18 July, 2026 | 11:57 AM

Breaking News

రాష్ట్రంలోని తహశీల్దార్లతో మంత్రి పొంగులేటి సమావేశం

29-09-2024 07:17 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని తహశీల్దార్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... సామాన్యలకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తామని, ప్రభుత్వ భూమి అంగుళం కూడా ఆక్రమణకు గురి కావొద్దని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామన్నారు. తహశీల్దార్ల బదిలీలపై త్వరలో ఉద్యోగ సంఘాలతో సమీక్షిస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.