బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు
హైదరాబాద్: బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు సదస్సుకు హాజరుకానున్నారు. 2023లో కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రకటించిన చోటు సంగ్రామ సదస్సు ఏర్పాటు చేయడం విశేషం. యువకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని బీఆర్ఎస్ ఎండగడతామని చెబుతోంది.
పార్టీలకు అతీతంగా విద్యార్థులు, నిరుద్యోగులు తరలిరావాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. యువ సంగ్రామ సదస్సుకు మొదట పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందింది. యువ సంగ్రామ సదస్సు దృష్ట్యా హైదరాబాద్ లోని పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు గృహనిర్భంధం చేశారు. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ గృహ నిర్బంధం చేయడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






