calender_icon.png 21 January, 2026 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్‌లో జాతీయ జెండా వందనం చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

18-09-2024 12:37:07 AM

హనుమకొండ(విజయక్రాంతి) : వరంగల్ ఓసిటీ మైదానంలో జాతీయ పతాకాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎగురవేసి మాట్లాడారు. వరంగల్ సమగ్రాభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకదృష్టి సారించారని అన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వేడుకలో నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ కడియం కావ్య,  కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, డీసీపీ రవిందర్ తదితరులు పాల్గొన్నారు.